చిన్న సినిమా...పెద్ద డిస్కషన్

updated: February 20, 2018 19:10 IST
చిన్న సినిమా...పెద్ద డిస్కషన్

రాబోయే ఎలక్షన్స్ రంగం సిద్దమవుతోంది. మెల్లిమెల్లిగా మీడియా తన రూపు మార్చుకుంటున్నట్లే ...సినీ జనం సైతం పొలిటికల్ సినిమాలతో పలకరించటానికి రెడీ అవుతున్నారు. ఆ కోవలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’ . ఏ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సినిమా చేస్తున్నారో కానీ మార్కెట్లో మంచి బజ్ నే క్రియేట్ చేస్తోంది. ప్రస్తతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న మోహన్ రావిపాటి దర్శకుడు కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ సినిమా హక్కుల కోసం చాలా మంది ఎక్వైరీ లు చేస్తున్నారు.  

 

సమకాలీన అంశాలతో పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కున  చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’ . ఈ చిత్రం  దర్శకుడు మోహన్‌ రావిపాటి. ఆలూరి క్రియేషన్స్‌ పతాకంపై ఆయన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో వాయు తనయ్‌, శశి, దేవి ప్రసాద్‌ కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యలర్ షూటింగ్ వైజాగ్, ఒంగోలు, హైదరాబాద్ లో జరుపుకుంది. ఇప్పుడు పోస్ట్  ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది టీమ్. 

నిర్మాత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ- మా చిత్రం ద్వారా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదు. పబ్లి క్ పాయింట్ వ్యూలో కూడా సినిమాలో చర్చిస్తున్నాం. మా దర్శకుడు మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఇకమీద మా బేనర్‌లో ఇలా వరుసగా సామాజిక కుటుంబ కథా చిత్రాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం అన్నారు. 

 సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ మాట్లాడుతూ- ఇందులో నాలుగు పాటలున్నాయి. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న చిత్రం. నాతో దర్శకుడు మంచి బాణీలు చేయిస్తున్నారు అన్నారు. వాయుతనయ్, శశి, దేవిప్రసాద్, నళినికాం, రామరాజు, శుభలేఖ సుధాకర్, సుచిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఫణి కళ్యాణ్, కెమెరా:కమలాకర్, రచన సహకారం:హిరణ్మయి, సత్య.జె.బి, నిర్మాత:ఆలూరి సాంబశివరావు, రచన, దర్శకత్వం:మోహన్ రావిపాటి.

comments