'హ్యాక్ డ్ బై డెవిల్' బ్యానర్ నుంచి మరో చిత్రం

updated: April 23, 2018 19:08 IST
'హ్యాక్ డ్ బై డెవిల్' బ్యానర్ నుంచి మరో చిత్రం

లాగిన్‌ మీడియా పతాకంపై మేఘన, సంతోషి, సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్‌ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌. వై నిర్మించిన హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘హ్యాక్‌డ్‌ బై డెవిల్‌’ (హెచ్‌బిడి). ఈ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఆ ఉత్సాహంతో  ఇదే బ్యానర్ లో మరో చిత్రం ప్రారంభించారు నిర్మాతలు.  శ్రీరామ్, పల్లవి జంటగా ఈ  కొత్త చిత్రం తెరకెక్కుతోంది. 

లాగిన్‌ మీడియా శ్రీధర్‌రెడ్డి ఆశీస్సులతో కృష్ణ కార్తీక్‌ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా  హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ క్లాప్‌ ఇచ్చారు. మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. 

కృష్ణ కార్తీక్‌ మాట్లాడుతూ –‘‘. ప్రయోగాత్మక చిత్రాలనే ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్ గారు మళ్లీ నాకు రెండవ అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్, రెగులర్ ఫార్మేట్ లో కాకుండా రియలిస్టిక్ గా 

కథను సినిమా గా రూపొందిస్తున్నాం, చెప్పాలంటే క్యూట్ లవ్ స్టొరీ, ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. అందరి కథ ఈ సినిమా.. రియాలిస్టిక్ సినిమా కనుక నేచురల్ లుక్ కోసం లోకల్ హీరో ను  

తీసుకోవడం జరిగింది. తెలుగు ఆడియన్స్ కు గుర్తుండిపోయే ఆర్టిస్టులు అవుతారు.. ఏం తీశారురా అనే సినిమాల లిస్ట్ లోనికి ఈ చిత్రం చేరుతుంది. మన లోకల్ సినిమా కనుక తెలంగాణ లోని ప్రతి 

ప్రాంతంలోనూ షూట్ జరుపుకోనుంది.. నెక్స్ట్ వీక్ లో మొదటి షెడ్యూల్ ను ప్రారంభించి 35డేస్ లో షూట్ కంప్లీట్ చేసి రెండు నెలల్లో రిలీజ్ ప్లాన్ చేస్తాము.. మ్యూజిక్ ఈ చిత్రంలో ప్రధానం. అని 

తెలియచేసారు. బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ లో పూజ నిర్వహించిన ఈ నూతన చిత్రం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నా, ’’ అన్నారు

comments